Monday, June 8, 2009

పెళ్ళి ఇందుకేనా?

ఇది కత్తి మహేష్ గారి పర్ణశాల బ్లాగ్ లో పెళ్ళెందుకు అనే టపా కి స్పందన.ఆయన బ్లాగ్ లోనే కామెంట్ పెట్టొచ్చు కానీ విషయం కొంచెం ఎక్కువ ఉండడం,నాది కొత్త బ్లాగ్ కావడం వలన ఒక టపా పడేసినినట్టుంటుందని ఇక్కడ రాస్తున్నా:)

పెళ్ళి మగాడికి సెక్స్ కోసం ఆడదానికి సామాజిక/ఆర్ధిక భద్రత కోసం అనే థియరీ కాసేపు పక్కన పెడదాం.ఇద్దరూ ఆర్ధిక స్వావలంబన కలిగిన వాళ్ళే ఐతే అప్పుడు పెళ్ళి అవసరమేంటి?

సిరివెన్నెల గారి భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరూ పాట గుర్తుందా?
"వంటకని వైఫెందుకురా హోటళ్ళే చాలు
ఒంటికని ఒకటా రెండా అంగడి అందాలు
కోతికి ఉందా కోడికి ఉందా ఈ పెళ్ళాచారం
జంటలు కట్టే జంతువులెరుగవు వెడ్డింగ్ విడ్డూరం
ఎందుకు మనకీ గ్రహచారం"
గిరీశం అన్నట్టు అన్నీ వేదాల్లోనే ఉన్నాయో లేవో గాని అన్ని ప్రశ్నలకి సమాధానాలు మాత్రం స్రుష్టి(ప్రకృతి)లోనే దొరుకుతాయేమో.March of the penguins చూసారా?అదొక అద్భుతం .ఒక ఆడ,మగ ఎందుకు కలిసుండాలి అనే ప్రశ్నకి ప్రకృతి ఇచ్చే సమాధానం.

ఎంపరర్ పెంగ్విన్లకి ఆడ మగ జత కట్టడం అనేది struggule for survival.తమ జాతి అంతరించిపోకుండా పోరాటం.మనిషికి అంతరించిపోతాననే భయం లేదు.ఎలాగూ అన్ని ప్రాణుల్నీ అంతరింపజేయందే మనిషి చావడు:) so may be ఆ struggle for survivalఅనేది పర్సనల్ లెవెల్‌కి వస్తుందనుకుంటా.తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కావాలని.


స్రుష్టిలో యుక్త వయసు నుంచి చనిపోయే వరకూ ఒకే భాగస్వామితో ఉండే ప్రాణి ఏదైనా ఉందా?వాటి సంతానానికి సొంతంగా అహార సంపాదన చేసుకోగల సామర్థ్యం వచ్చే వరకూ చాలా loyal/dedicated గా కలిసుంటాయి. ఏనుగైతే నాలుగైదేళ్ళు.పులి,సింహం లాంటివి రెండేళ్ళనుకుందాం.అంత ప్రాణానికి ప్రాణంగా ఉండే పెంగ్విన్లు కూడ ఒక బ్రీడింగ్ సీజన్(about 1 year )అయ్యాక తర్వాతి సీజన్లో వేరేవాటితో జత కడతాయి.అయితే మనిషికి మాత్రం ఈ పీరియడ్, అంటే తన సంతానం సమాజంలో సొంతంగా కాళ్ళ మీద నిలబడేప్పటికి కనీసం పదిహేనేళ్ళైనా పడుతుంది.అందుకే పెళ్ళి అవసరమౌతుందేమో.

సంసారంలో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటే సరే.అదే కొరవడితే?
"ek Chhat Ke Tale Ajanabi Ho Jaate Hai Rishtey
Bistar Pe Chaadaro Se Chhup So Jaate Hai Rishtey"

అలాంటప్పుడు పిల్లల కోసమైనా సరే కలిసుండడానికి ప్రయత్నిస్తారేమో.



p.s: శ్రీ is a fabulous music director who has worked for films like gaayam,little soldiers,sindhooram,money,aavida maa aavide.his songs are simple yet haunting.It is a pity what the industry has done to him.


3 comments:

  1. మిత్రమా నీ బ్లాగును కూడలిలో చేర్చడం చాలా సులభం
    1. మొదట కూడలి వెబ్‌సైట్‌లోకి వెళ్లు. (డబ్ల్యుడబ్యుయు . కెఒఒడిఎఎల్‌ఐ. ఒఆర్‌జి)
    2. ఈ వెబ్‌సైట్‌లో కుడి పక్కన పై భాగంలో 'కొత్త బ్లాగును చేర్చండి' అనే చోట క్లిక్‌ చేయండి. వివరాలు తెలుస్తాయి.
    లేదా
    మీ బ్లాగు యుఆర్‌ఎల్‌ను సపోర్ట్‌ ఎట్‌ కూడలి. ఆర్గ్‌ (ఎస్‌యుపిపిఒఆర్‌టి ఎట్‌ కెఒఒడిఎఎల్‌ఐ.ఒఆర్‌జి)కి మెయిల్‌ చేయండి. మీ టపాలు అభ్యంరంగా ూంటే ఎటువంటి ముందస్థు హెచ్చరిక లేకుండానే కూడలి నుంచి తొలగిస్తారు. మరో ముఖ్య విషయం మీ బ్లాగు కచ్చితంగా తెలుగులోనే ూండాలి సుమా.
    www.palavelli.blogspot.com www.koodali.org

    ReplyDelete
  2. vinod how to add a link to other website in posts and comments.can you explain.

    ReplyDelete
  3. వినోద్ గారూ,
    పెళ్లి గురించి మీరు చెప్పింది బావుంది. మీరు చెప్పిన పెంగ్విన్ సినిమా చూడడానికి ప్రయత్నిస్తాను.
    మళ్ళీ మీ బ్లాగులో ఏమీ రాయలేదేంటి.?
    చాలా తొందరగా కామెంట్ పెట్టాను కదా మీ పోస్టుకి ;)

    ReplyDelete