Monday, June 8, 2009

పెళ్ళి ఇందుకేనా?

ఇది కత్తి మహేష్ గారి పర్ణశాల బ్లాగ్ లో పెళ్ళెందుకు అనే టపా కి స్పందన.ఆయన బ్లాగ్ లోనే కామెంట్ పెట్టొచ్చు కానీ విషయం కొంచెం ఎక్కువ ఉండడం,నాది కొత్త బ్లాగ్ కావడం వలన ఒక టపా పడేసినినట్టుంటుందని ఇక్కడ రాస్తున్నా:)

పెళ్ళి మగాడికి సెక్స్ కోసం ఆడదానికి సామాజిక/ఆర్ధిక భద్రత కోసం అనే థియరీ కాసేపు పక్కన పెడదాం.ఇద్దరూ ఆర్ధిక స్వావలంబన కలిగిన వాళ్ళే ఐతే అప్పుడు పెళ్ళి అవసరమేంటి?

సిరివెన్నెల గారి భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరూ పాట గుర్తుందా?
"వంటకని వైఫెందుకురా హోటళ్ళే చాలు
ఒంటికని ఒకటా రెండా అంగడి అందాలు
కోతికి ఉందా కోడికి ఉందా ఈ పెళ్ళాచారం
జంటలు కట్టే జంతువులెరుగవు వెడ్డింగ్ విడ్డూరం
ఎందుకు మనకీ గ్రహచారం"
గిరీశం అన్నట్టు అన్నీ వేదాల్లోనే ఉన్నాయో లేవో గాని అన్ని ప్రశ్నలకి సమాధానాలు మాత్రం స్రుష్టి(ప్రకృతి)లోనే దొరుకుతాయేమో.March of the penguins చూసారా?అదొక అద్భుతం .ఒక ఆడ,మగ ఎందుకు కలిసుండాలి అనే ప్రశ్నకి ప్రకృతి ఇచ్చే సమాధానం.

ఎంపరర్ పెంగ్విన్లకి ఆడ మగ జత కట్టడం అనేది struggule for survival.తమ జాతి అంతరించిపోకుండా పోరాటం.మనిషికి అంతరించిపోతాననే భయం లేదు.ఎలాగూ అన్ని ప్రాణుల్నీ అంతరింపజేయందే మనిషి చావడు:) so may be ఆ struggle for survivalఅనేది పర్సనల్ లెవెల్‌కి వస్తుందనుకుంటా.తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కావాలని.


స్రుష్టిలో యుక్త వయసు నుంచి చనిపోయే వరకూ ఒకే భాగస్వామితో ఉండే ప్రాణి ఏదైనా ఉందా?వాటి సంతానానికి సొంతంగా అహార సంపాదన చేసుకోగల సామర్థ్యం వచ్చే వరకూ చాలా loyal/dedicated గా కలిసుంటాయి. ఏనుగైతే నాలుగైదేళ్ళు.పులి,సింహం లాంటివి రెండేళ్ళనుకుందాం.అంత ప్రాణానికి ప్రాణంగా ఉండే పెంగ్విన్లు కూడ ఒక బ్రీడింగ్ సీజన్(about 1 year )అయ్యాక తర్వాతి సీజన్లో వేరేవాటితో జత కడతాయి.అయితే మనిషికి మాత్రం ఈ పీరియడ్, అంటే తన సంతానం సమాజంలో సొంతంగా కాళ్ళ మీద నిలబడేప్పటికి కనీసం పదిహేనేళ్ళైనా పడుతుంది.అందుకే పెళ్ళి అవసరమౌతుందేమో.

సంసారంలో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటే సరే.అదే కొరవడితే?
"ek Chhat Ke Tale Ajanabi Ho Jaate Hai Rishtey
Bistar Pe Chaadaro Se Chhup So Jaate Hai Rishtey"

అలాంటప్పుడు పిల్లల కోసమైనా సరే కలిసుండడానికి ప్రయత్నిస్తారేమో.



p.s: శ్రీ is a fabulous music director who has worked for films like gaayam,little soldiers,sindhooram,money,aavida maa aavide.his songs are simple yet haunting.It is a pity what the industry has done to him.


Sunday, June 7, 2009

Cultural Invasion


నిన్న రాత్రి "గీతాచార్య" బ్లాగ్ లో అనుకుంటా నరసరావ్ పేట లో ఆయన సంపాదించిన భారత ప్రభుత్వంచే కొత్తగా జారీ చేయబడిన పది రూపాయల బిళ్ళల్ని చూశా.కొత్త డిజైనేమీ కాదు.కొన్నాళ్ళ క్రితం రెండు రూపాయల బిళ్ళ పైన కూడా అదే సింబల్.ఐతే ఆ సింబల్ పెట్టడం వెనక ఉద్దేశమేంటనేదే అప్పుడూ,ఇప్పుడూ చర్చ.
RBI చెప్పేదాని ప్రకారం ఇది మన spirit of unityకి చిహ్నమంట.దీన్ని డిజైన్ చేసింది National Institute of Design,అహ్మదాబాదంట.


Is it crusaders' cross?

check these links http://indianrealist.wordpress.com/2009/04/16/the-cross-is-back/
http://en.wikipedia.org/wiki/Jerusalem_cross
http://en.wikipedia.org/wiki/Cross

it was given by the Pope Urban II to the crusaders for their very first crusade that was launched from Jerusalem. The four “crosslets” on the corners along with the main cross are supposed to show the five wholy wounds of christ.

మతాలకతీతంగా భారతీయత గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే 'సత్యమేవ జయతే'.అశోకుడు తెలుగు వాడు కాదు.బౌద్దంలోకి మారిన భారతీయుడు.(హిందువని అనట్లేదెందుకంటే 304 B.C– 232 B.C మధ్య భారత ఉపఖండం లో పై రెండు కాక వేరే మతాలు లేవని.క్రీస్తు పుట్టడానికింకా 270 సంవత్సరాలుంది).అశోకుడు రోడ్లకిరువైపులా చెట్లు నాటించెను అని చడువుకున్నప్పుడు,జాతీయ జెండాపై అశొక చక్రం, national emblemగా మూడు సిం హాలు అశోకుని సారనాథ్ స్థూపం నుండి స్వీకరించినవేనని చదువుకున్నప్పుడు మన మూలాల మీద, మన దేశం మీద ప్రేమ సహజంగానే కలిగింది. ఇప్పుడు యిణ్ణాళ్ళకి ఈ ఇటలీ కోడలు,ఆమె కోటరీ వలన కరెన్సీ కాయిన్లమీద సత్యమేవ జయతే ని,మూడు సిం హాలనీ మైక్రోస్కోపిక్ లెవల్ కి కుదించేసి ఈ దిక్కుమాలిన Louis the pious గాడి కోసం మాత్రం ఒక పక్క మొత్తం కేటాయించారు.

check this link http://home.eckerd.edu/~oberhot/flouisphome.htm


అయినా 2004లో సోనియా గనుక ప్రధాని పదవి తీసుకుంటే నేను గుండు కొట్టించుకుంటానని సుష్మ స్వరాజ్ అన్నప్పుడు ఆమెని అసహ్యించుకున్న సవాలక్షమంది ఉదారవాదులలో నేనూ ఒకడ్ని.మనకిది తగిన శాస్తే. ఈవిడ గురించి ఇప్పుడు అందుబాటులో ఉన్నంత సమాచారం అప్పుడు లేదు. http://indiaview.wordpress.com/2008/04/30/ltte-sonia-link/
http://www.janataparty.org/sonia.html


నాకు తెలీక అడుగుతాను,నిరుపేదలు సరే,క్రిస్టియన్ మేధావులకైనా ఈ మతమార్పిడిల వలన జరిగే నష్టం అర్థం అవదా?అగ్రవర్ణాలు,భూస్వాములు అనే జంగురు పిల్లులకు భయపడి మతం తోలు కప్పుకున్న సామ్రాజ్యవాదం అనే 'తెల్ల'పులి నోట్లొ తల పెడుతున్నామని?
http://www.joshuaproject.net/

APTDC(andhra pradesh tourism development corporation)బస్సుల్ని హైదరాబాద్ లో చూసినప్పుడు కూడా నాకు ఆ సంస్థకి ఆ లోగో కి రెలెవెన్స్ ఏంటో అర్థం కాలా.ఆ లోగో ఏంటయ్యా అంటే Uని నిలువుగా సాగదీసి పైన రెందు నిలువు గీతల మీద ఒక్కొక్క అడ్డ గీత పెట్టి రెండు+ లు వచ్చేలా చేయడం.చర్చి వాహనాల మీదా, ambulanceల మీదా చూసాం కానీ టూరిస్ట్ బస్సులమీద చూడడం అదే ఫస్టు.net లో ట్రై చేశా కానీ మంచి బొమ్మ దొరకలా.ఈ బస్సు ని జూం చేసి చూడండి కనిపిస్తుంది.


ఇక కేంద్రీయ విద్యాలయ్ లోగో సంగతి.ఎప్పటినుంచో ఉన్న లోగోలో ఉదయించే సూర్యుడు,సరస్వతీ దేవికి చిహ్నంగా తామరపూవు ఉంటాయి.

హ్యూమన్ రిసోర్సెస్ మినిస్ట్రీని గబ్బు పట్టించిన అర్జున్ సింగ్ ఆధ్వర్యంలో 2008లో ఒక కమిటీ వేసారు .లోగో మార్చడానికి కారణం:నలభై యేళ్ళ నుంచీ ఉన్న లోగోకి శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరిగిన అభివ్రుద్ది,మారిన సామాజిక కోణాలు,మొదలైనవాటికి తగ్గట్టుగా కొత్త రూపు ఇవ్వడం.ఈ కొత్త లోగోని సెలెక్ట్ చేశాక చెప్పిందేంటంటే The old logo has been replaced “with a globe showing children reaching out and a satellite in the sky”.
సరిగ్గా చూస్తే తట్టేదేంటంటే ఆ పిల్లలిద్దరి తలకాయలూ ఇస్లాం గుర్తు నెలవంక,మధ్యలో నక్షత్రం.ఇందులో ఒక తల వెనక రెండు శిలువలు.బానే వుంది కానీ,సరస్వతీ దేవికి చిహ్నమైన తామర పూవుని మాత్రం భా.జ.పా.చిహ్నమని చెప్పి అర్జున్ సింగ్ గారు పీకేసారట.

Saturday, June 6, 2009

కూడలి కోసం

కూడలికి రావడం ఒక నెల నుంచి అలవాటు.నచ్చడానికి కారణం బ్లాగర్లంతా ఒక కమ్మ్యూనిటీ లాగ ఉండటం(కొట్టుకున్నా,తిట్టుకున్నా సరే).నాకు కూడలికొస్తే మా ఇంజినీరింగ్ క్లాస్ గుర్తుకొస్తుంది.**క్లాస్ లో అందరూ సరదాగా యేడిపించేది ఒక్కడినే,మార్తాండ.ఇద్దరు మాత్రం సై అంటే సై-మహేష్,యోగి.ఆఖరు బెంచి మీద కూర్చుని ఫస్ట్ రాంక్ కొట్టేసే రెబెల్ స్టూడెంట్ మరియు అతని మిత్ర బృందం మలక్ పేట రౌడీ-శరత్&co.ఇక అమ్మాయిలు.ఉన్న వాళ్ళందరినీ(సుజాత గారు,అరుణ గారు,సౌమ్య గారు,....)కలేసి మగవాళ్ళ యెత్తులకు పై యెత్తులు వేసేది జ్యోతి గారు.క్లాసులో ఏ ఒక్కరితోనూ గొడవలు పడకుండా అందరిచేతా అభిమానించబడేది కల్హరి స్వాతి గారు.వీళ్ళు కాక క్లాసులో కొంతమంది సైలెంటు పెద్దమనుషులు జీడిపప్పు,కొత్తపాళి,బొల్లోజు బాబా గార్లు.ఇంతమందిలో ఎవరు యెగస్ట్రాలేసినా తోక కత్తిరించేది far end left corner లో కూర్చుని నిద్రపోతుండే యేకలింగం.వీళ్ళందరి అల్లరినీ భరించే ప్రిన్సిపాల్ వీవెన్.అప్పుడప్పుడూ ఈయన కూడా అందరు ప్రిన్సిపాల్స్ లాగానే మొదటి బెంచి స్టూడెంట్సు మాటలు విని అల్లరి పిల్లలని సస్పెండ్ చేస్తుంటారు.తప్పొప్పుల పని లేకుండానే.**

మొదట్లో కూడలికొచ్చి కంటికి ఇంపుగా ఉన్న బ్లాగ్ వెంట నడుస్తూ ఉండేవాడిని.పర్ణశాలలో వేడి వేడి చర్చలు చదివి బుర్ర వేడెక్కితే sirisha political closeup దగ్గర కాసేపు నవ్వుకునేవాడిని.తర్వాత్తర్వాత జ్యోతిగారి పుణుకులూ,రౌడీ గారి రీమిక్సులూ అలవాటయ్యాయి.శరత్ ఒకప్పుడు 'శుద్దమైన' సాహితీ రచన చేశాడనీ తెలిసింది.ప్రస్తుతానికి ప్రమదా వనానికీ ప్రమాద వనానికీ సంబంధమేమిటో,కూడలికి పహారాగా కొండముచ్చులనెందుకు ఆశ్రయించాల్సొచ్చిందో అర్ధమయ్యింది.

సరే.ఇప్పుడు,నేనీ బ్లాగ్ క్రియేట్ చేసింది ఎందుకంటే ఇది ఫ్రీ కాబట్టీ,కూడలిలో నేనొక విషయం చర్చకు పెడదామనుకుంటున్నాను కాబట్టీ.weekend debate/discussion.కూడలిలో అదెప్పుదూ హాట్ టాపిక్కే.అదేంటో, తర్వాతి టపాలో చెబుతా.ఈలోపు మీకొక ప్రశ్న.భారతదేశ సమైక్యత/ సామరస్యం/ సమగ్రత లకి ఒక చిహ్నం కావాలి.మరీ చిన్నది ,మరీ పెద్దది కాకుండా ఒక రూపాయి బిళ్ళంత సైజులో ఊహించుకోండి.నాకు ఈ బ్లాగ్ కొనసాగిద్దామనే ఉద్దేశమేమీ లేదు గనుక interests,favorites లాంటి సోదేదీ ఇవ్వట్లా.

**నుండి **వరకు అంతా నా పర్సనల్ ఒపీనియన్,don't feel bad,లైట్ తీస్కో ,వగైరా,వగైరా.

ఇంకొక్క మనవి.comment చేసేవారు వారి పేర్లు ఇస్తే బాగుంటుంది.బ్లాగ్ పేర్లు కాదు.నాకెందుకో తెలుగోడు గారు, పసిగుడ్డు గారు,అబ్రకదబ్రా గారు,జీడిపప్పు గారు అని పిలవడం అంత ఇష్టం ఉండదు. మీకు?