Saturday, June 6, 2009

కూడలి కోసం

కూడలికి రావడం ఒక నెల నుంచి అలవాటు.నచ్చడానికి కారణం బ్లాగర్లంతా ఒక కమ్మ్యూనిటీ లాగ ఉండటం(కొట్టుకున్నా,తిట్టుకున్నా సరే).నాకు కూడలికొస్తే మా ఇంజినీరింగ్ క్లాస్ గుర్తుకొస్తుంది.**క్లాస్ లో అందరూ సరదాగా యేడిపించేది ఒక్కడినే,మార్తాండ.ఇద్దరు మాత్రం సై అంటే సై-మహేష్,యోగి.ఆఖరు బెంచి మీద కూర్చుని ఫస్ట్ రాంక్ కొట్టేసే రెబెల్ స్టూడెంట్ మరియు అతని మిత్ర బృందం మలక్ పేట రౌడీ-శరత్&co.ఇక అమ్మాయిలు.ఉన్న వాళ్ళందరినీ(సుజాత గారు,అరుణ గారు,సౌమ్య గారు,....)కలేసి మగవాళ్ళ యెత్తులకు పై యెత్తులు వేసేది జ్యోతి గారు.క్లాసులో ఏ ఒక్కరితోనూ గొడవలు పడకుండా అందరిచేతా అభిమానించబడేది కల్హరి స్వాతి గారు.వీళ్ళు కాక క్లాసులో కొంతమంది సైలెంటు పెద్దమనుషులు జీడిపప్పు,కొత్తపాళి,బొల్లోజు బాబా గార్లు.ఇంతమందిలో ఎవరు యెగస్ట్రాలేసినా తోక కత్తిరించేది far end left corner లో కూర్చుని నిద్రపోతుండే యేకలింగం.వీళ్ళందరి అల్లరినీ భరించే ప్రిన్సిపాల్ వీవెన్.అప్పుడప్పుడూ ఈయన కూడా అందరు ప్రిన్సిపాల్స్ లాగానే మొదటి బెంచి స్టూడెంట్సు మాటలు విని అల్లరి పిల్లలని సస్పెండ్ చేస్తుంటారు.తప్పొప్పుల పని లేకుండానే.**

మొదట్లో కూడలికొచ్చి కంటికి ఇంపుగా ఉన్న బ్లాగ్ వెంట నడుస్తూ ఉండేవాడిని.పర్ణశాలలో వేడి వేడి చర్చలు చదివి బుర్ర వేడెక్కితే sirisha political closeup దగ్గర కాసేపు నవ్వుకునేవాడిని.తర్వాత్తర్వాత జ్యోతిగారి పుణుకులూ,రౌడీ గారి రీమిక్సులూ అలవాటయ్యాయి.శరత్ ఒకప్పుడు 'శుద్దమైన' సాహితీ రచన చేశాడనీ తెలిసింది.ప్రస్తుతానికి ప్రమదా వనానికీ ప్రమాద వనానికీ సంబంధమేమిటో,కూడలికి పహారాగా కొండముచ్చులనెందుకు ఆశ్రయించాల్సొచ్చిందో అర్ధమయ్యింది.

సరే.ఇప్పుడు,నేనీ బ్లాగ్ క్రియేట్ చేసింది ఎందుకంటే ఇది ఫ్రీ కాబట్టీ,కూడలిలో నేనొక విషయం చర్చకు పెడదామనుకుంటున్నాను కాబట్టీ.weekend debate/discussion.కూడలిలో అదెప్పుదూ హాట్ టాపిక్కే.అదేంటో, తర్వాతి టపాలో చెబుతా.ఈలోపు మీకొక ప్రశ్న.భారతదేశ సమైక్యత/ సామరస్యం/ సమగ్రత లకి ఒక చిహ్నం కావాలి.మరీ చిన్నది ,మరీ పెద్దది కాకుండా ఒక రూపాయి బిళ్ళంత సైజులో ఊహించుకోండి.నాకు ఈ బ్లాగ్ కొనసాగిద్దామనే ఉద్దేశమేమీ లేదు గనుక interests,favorites లాంటి సోదేదీ ఇవ్వట్లా.

**నుండి **వరకు అంతా నా పర్సనల్ ఒపీనియన్,don't feel bad,లైట్ తీస్కో ,వగైరా,వగైరా.

ఇంకొక్క మనవి.comment చేసేవారు వారి పేర్లు ఇస్తే బాగుంటుంది.బ్లాగ్ పేర్లు కాదు.నాకెందుకో తెలుగోడు గారు, పసిగుడ్డు గారు,అబ్రకదబ్రా గారు,జీడిపప్పు గారు అని పిలవడం అంత ఇష్టం ఉండదు. మీకు?

5 comments: